NTPC Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త..
ఇటీవల ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ నుంచి వరుసగా ఉద్యోగ ప్రకటనలు విడుదలవుతున్నాయి. తాజాగా సంస్థ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ విభాగంలో ఈ నియామకాలు చేపట్టిన్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మొత్తం 280 ఖాళీలను భర్తీ చేయనున్నారు, గేట్(GATE) స్కోర్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఈ నియామకాలకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మే 21న ప్రారంభం కానుంది. రిజిస్ట్రేషన్లకు జూన్ 10ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీల్లోగా అప్లై చేసుకోవాలని సూచించారు.
ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎన్స్ట్రుమెంటేషన్ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 40 వేల నుంచి రూ. 1.40 లక్షల వరకు వేతనం చెల్లించనున్నారు. విద్యార్హతల వివరాలు.. ఎలక్టికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, పవర్ సిస్టమ్స్ & హై ఓల్టేజ్, మెకానికల్, ప్రొడక్షన్, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, ప్రొడక్షన్ & ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, థర్మల్, మెకానికల్ & ఆటోమేషన్, పవర్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్, పవర్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ & కంట్రోల్ తదితర కోర్సుల్లో బీటెక్ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
అభ్యర్థులకు గరిష్ట వయస్సు 27 ఏళ్లు ఉండాలి. వివిధ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఇచ్చారు. ఆ వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. అభ్యర్థులు తప్పనిసరిగా గేట్ 2021 పరీక్షకు హాజరై ఉండాలి. ఆ పరీక్షలో సాధించిన స్కోర్, గ్రూప్ డిస్కషన్ లో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
http://Webisite Link : https://www.ntpccareers.net/
ఎలా అప్లై చేయాలంటే.. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 21 నుంచి 10 జూన్ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసే సమయంలో గేట్ 2021 పరీక్షకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సంఖ్య నమోదు చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.