Samantha: త్వరలో తల్లి కాబోతున్న సమంత.. రెండో పెళ్లి పై సంచలన నిర్ణయం..
Samantha Sensational Decision: సౌత్ ఇండియన్ స్టార్ బ్యూటీగా క్రేజ్ ని సంపాదించుకుంది సమంత. టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ వయసు పెరుగుతున్నకొద్దీ సినిమాల్లో క్రేజ్ ని కూడా మరింతగా పెంచుకుంటూ లైఫ్ లో దూసుకుపోతోంది. సినీ కెరీర్‌లో మంచి సక్సెస్ ని అందుకుంటూ స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మా. పర్సనల్ జీవితంలో మాత్రం చాలా ఒడిదొడుకులని ఎదుర్కొంటోంది. వ్యక్తిగత జీవితం ఎన్నో ఒడిదుడుకులకు లోనైంది. భర్త చైతన్యతో మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకోవడం, నిందలు ఆరోపణలు, ట్రోల్స్ ఇలా అన్నీ ఆమెను మానసికంగా కుంగదీశాయి.
వెంటనే మా మరో ఆరోగ్య సమస్య ఆమెను చుట్టుముట్టింది. గత కొంతకాలంగా మయోసైట్స్ వ్యాధితో ఆమె బాధపడుతోంది. ఏడాది కాలంగా ఈ వ్యాధికి సమంత చికిత్స తీసుకుంటున్నప్పటికీ అది పూర్తిగా క్యూర్ కాలేదు. ఇటీవల సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చి మరీ విదేశాల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటూ విశ్రాంతి తీసుకుంటోంది. ఇదిలా ఉండగా 36 ఏళ్ళ వయసు దాటిపోవడంతో సమంతకి మళ్లీ పెళ్లి చేయాలని ఉద్దెశంతో ఆమె తల్లితండ్రులు ప్రెషర్ పెడుతున్నారట. స్నేహితులు కూడా వెంటనే వివాహం చేసుకోమంటూ సలహా ఇస్తున్నారని తెలుస్తోంది(Samantha Sensational Decision).
అయితే సమంత మాత్రం తన జీవితంలో మళ్లీ పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అయిందట. ఇకపై ఒంటరిగా ఉండిపోవాలని అనుకుంటున్న సమంతా మిగిలిన జీవితాన్ని నటనకి సోషల్ వర్క్ కోసం కేటాయించబోతున్నట్లు తెలుస్తోంది. తల్లి కావాలన్న ఆమె కోరికని తీర్చుకోవడానికి ఇద్దరు పిల్లలు భవిష్యత్ లో దత్తత తీసుకొని వారికి తల్లిగా ఉంటూ వారి బాగోగులు చూసుకోవాలని సమంత నిర్ణయం తీసుకుంటుందట. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ లేకపోయినప్పటికీ ప్రస్తుతం ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(Samantha Sensational Decision)
ఇక సమంత 2014 నుంచి ప్రత్యూష సపోర్ట్ పేరుతో ఓ చారిటీ ట్రస్ట్ ఇరాన్ చేస్తూ మహిళలు ఆడపిల్లల సంక్షేమానికి కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. అదే బాటలో ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకుని అమ్మ అవుతారని తెలుస్తోంది. అయితే ఇటీవల ఆమె సినిమాలకి దూరంగా ఉన్న సమంత కొత్త ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయలేదు. ఇక చివరిగా సిటాడెల్ వెబ్ సిరీస్ లో నటించింది ఈ ముద్దుగుమ్మ. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సిరీస్ వచ్చే ఏడాది అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. మన ప్రియతమ నటి సమంతా రూత్ ప్రభు.
తన నటనా నైపుణ్యం కోసం మాత్రమే కాకుండా తన సంతోషకరమైన ప్రయాణ కథల కోసం కూడా తన అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం, ఆమె తన ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడానికి నటన నుండి విరామం తీసుకుంటోంది మరియు ఆమె తన ప్రపంచ సాహసాల సంగ్రహావలోకనాలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది.